
Nana Rupa Dharudu
Sujatha
నానారూపధరుడు నారాయణుడు వీడే పూనినవుపములెల్లా బొసగెనితనికి గరిమ నేరులు వానకాలమునఁ బెనగొని సొరిది సముద్రము చొచ్చినయట్లు పురుషసూక్తమున విప్రులు సేసేమజ్జనము అరుదుగ పన్నీరెల్లా నమరే నీ హరికి అట్టే వెల్లమొయిళ్ళు ఆకసాన నిండినట్టు గట్టిగా మేన నిండెను కప్పురకాపు వొట్టి తన విష్ణుమాయ వొడలిపై వాలినట్టు తట్టుపుణుగమరెను దైవాలరాయనికి నిలువున సంపదలు నిలిచి రూపైనట్టు తెలివి సొమ్ములపెట్టె దెరచినట్టు అలమేలుమంగ వురమున నెలకొనెనిదె చెలరేగి శృంగారాల శ్రీవేంకుటేశునికి nAnArUpadharuDu nArAyaNuDu vIDE pUninavupamulellA bosagenitaniki garima nErulu vAnakAlamuna@M benagoni soridi samudramu chochchinayaTlu purushasUktamuna viprulu sEsEmajjanamu aruduga pannIrellA namarE nI hariki aTTE vellamoyiLLu AkasAna niMDinaTTu gaTTigA mEna niMDenu kappurakApu voTTi tana vishNumAya voDalipai vAlinaTTu taTTupuNugamarenu daivAlarAyaniki niluvuna saMpadalu nilichi rUpainaTTu telivi sommulapeTTe derachinaTTu alamElumaMga vuramuna nelakonenide chelarEgi SRMgArAla SrIvEMkuTESuniki
Chapters
5:48